తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎఫ్​ఏటీఎఫ్​ సమీక్షతో బ్లాక్​లిస్ట్​లోకి పాక్​! - ఉగ్రవాద నిరోధక చర్యలు

ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా, అక్రమ నగదు చలామణిని అరికట్టేందుకు పాక్​ చేపడుతున్న చర్యలను ఎఫ్​ఏటీఎఫ్​ వచ్చే వారం పరిశీలించనుంది. పాక్​ ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు తేలితే దానిని నిషేధిత జాబితాలో (బ్లాక్​లిస్ట్​) చేర్చే అవకాశం ఉంది.

ఎఫ్​ఏటీఎఫ్​: పాక్​ బ్లాక్​లిస్ట్​లోకి పోతుందా?

By

Published : Sep 6, 2019, 5:36 AM IST

Updated : Sep 29, 2019, 2:50 PM IST

అక్రమ నగదు చలామణిని అరికట్టి, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసే కార్యాచరణ ప్రణాళికను పాకిస్థాన్ సరిగ్గా అమలు చేస్తోందో లేదో అనే విషయాన్ని గ్లోబల్ వాచ్​డాగ్​ 'ఎఫ్​ఏటీఎఫ్'​ పరిశీలించనుంది. పాకిస్థాన్ ఒకవేళ ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవడంలో విఫలమైతే దానిని బ్లాక్​లిస్ట్​లో పెట్టే అవకాశమూ ఉంది.

బ్యాంకాక్​కు పాక్​...

'ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులను కలవడానికి పాకిస్థాన్ ప్రతినిధి బృందం సెప్టెంబర్​ 7న బ్యాంకాక్ వెళ్లనుంది. సెప్టెంబర్​ 8 నుంచి 10 వరకు జరిగే చర్చల్లో... ఉగ్రవాదులకు నిధులు అందకుండా పాక్​ చేపడుతున్న చర్యలను ఎఫ్​ఏటీఎఫ్​ అధికారులకు ఈ బృందం వివరించనుంది' అని సమా టీవీ పేర్కొంది.

అలాగే ఎఫ్​ఏటీఎఫ్​ అడిగే 100 అదనపు ప్రశ్నలకూ ఈ బృందం సమాధానాలు ఇవ్వనుందని తెలిపింది.

ఆగస్టు 18 నుంచి 23 వరకు ఆస్ట్రేలియా రాజధాని కాన్​బెర్రాలో ఇంటర్​ గవర్నమెంటల్​ ఆర్గనైజేషన్ వార్షిక (ఆసియా-పసిఫిక్​) సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉగ్రవాద నిరోధానికి తాము చేపడుతున్న 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక సమ్మతి నివేదికను పాక్​.... ఏఎఫ్​టీఎఫ్​కు సమర్పించింది.

బ్లాక్​లిస్ట్​లోకి..

పాక్​ నివేదికను మూల్యాంకనం చేసిన తరువాత... దానిని ఇప్పుడున్న గ్రే లిస్టు నుంచి బ్లాక్​ లిస్ట్​లో పెట్టాలా లేదా అన్నది ఎఫ్​ఏటీఎఫ్​ నిర్ణయిస్తుంది.

గతేడాది... అక్రమ నగదు చలామణి, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసే కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయని పాకిస్థాన్, ఇరాన్​లపై ఎఫ్​ఏటీఎఫ్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్​లోగా తగిన చర్యలు తీసుకోకపోతే బ్లాక్​లిస్ట్​లో పెడతామని హెచ్చరించింది.

ఇదీ చూడండి: 6 ప్లాన్లతో జియో ఫైబర్​ సేవలు ప్రారంభం

Last Updated : Sep 29, 2019, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details