FATF Pakistan News: నిర్దేశిత లక్ష్యాలను చేరుకోనందున ప్రపంచ మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ నిఘా సంస్థ (ఎఫ్ఏటీఎఫ్) పాకిస్థాన్‌ను జూన్ వరకు గ్రే జాబితాలోనే కొనసాగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికసాయం అందకుండా చర్యలు తీసుకోవటంలో విఫలమైనందున 2018 జూన్ నుంచి పాకిస్థాన్ ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితాలో కొనసాగుతోంది.
2019 అక్టోబర్ వరకు 27 పాయింట్ల యాక్షన్ ప్లాన్ పూర్తి చేయాలన్న ఎఫ్ఏటీఎఫ్ ఆదేశాలను చేరుకోవటంలో పాకిస్థాన్ విఫలమైంది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు శుక్రవారంతో ముగుస్తాయి. మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్స్‌ను ఎదుర్కొనే 2021 యాక్షన్ ప్లాన్‌ను 2023 జనవరి వరకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎఫ్ఏటీఎఫ్.