తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్ సైన్యంపై ఫేస్​బుక్ ఫైర్- పేజీ డిలీట్

మయన్మార్​లో హింసాత్మక పరిస్థితులపై స్పందించిన ఫేస్​బుక్.. ఆ దేశ మిలిటరీకి చెందిన అధికారిక పేజీని తొలగించింది. సంస్థ నిబంధనలను సైన్యం పదేపదే ఉల్లంఘిస్తోందని పేర్కొంది.

facebook blocks myanmar's military page
మయన్మార్ సైన్యంపై ఫేస్​బుక్ ఫైర్- పేజీ డిలీట్

By

Published : Feb 21, 2021, 1:53 PM IST

మయన్మార్‌లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులపై సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ తీవ్రంగా స్పందించింది. మాండలే నగరంలో శనివారం జరిగిన పౌర నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో.. ఆ దేశ మిలిటరీకి సంబంధించిన అధికారిక పేజీని ఫేస్‌బుక్‌ తొలగించింది. హింసాత్మక విధానాలతో తమ సంస్థ నిబంధనలను మిలిటరీ పదేపదే ఉల్లంఘిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు శనివారం హింసాత్మకం మారాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించగా.. మరో 40 మంది గాయాల పాలయ్యారు. మయన్మార్‌లో ఆన్‌లైన్‌ వేదికగా మిలిటరీ విద్వేష ప్రచారాల్ని నియంత్రించడంలో ఫేస్‌బుక్‌ విఫలమైందని గతంలో అంతర్జాతీయంగా ఆ సంస్థపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మిలిటరీ విద్వేష ప్రచారాల్ని అడ్డుకునేందుకు గత కొద్ది సంవత్సరాలుగా ఫేస్‌బుక్‌ ఆ దేశంలోని పౌర హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేస్తోంది. అంతేకాకుండా 2018లో ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ అయిన మిన్‌ ఆంగ్‌ హ్లయింగ్‌తో పాటు వందలాది మిలిటరీ సభ్యుల ఖాతాల్ని కూడా తొలగించడం గమనార్హం.

ఇదీ చదవండి:మయన్మార్: సైన్యం కాల్పుల్లో మరో ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details