తెలంగాణ

telangana

ETV Bharat / international

నవాజ్​ షరీఫ్​కు గుండెపోటు... ఆందోళనలో కుటుంబం! - nawaz sharif heart stroke

అనారోగ్యంతో బాధపడుతున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​కు గుండెపోటు వచ్చినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ప్రస్తుతం లాహోర్ ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆయనకు ప్లేట్​లెట్ల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది.

PAK-SHARIF

By

Published : Oct 26, 2019, 6:32 PM IST

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు గుండె పోటు వచ్చినట్టు పాక్‌ మీడియా తెలిపింది. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన్ను లాహోర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న షరీఫ్‌కు గుండెపోటు వచ్చినట్టు పాక్‌ సీనియర్‌ పాత్రికేయుడు హమీద్‌ మిర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మిర్ ట్వీట్

ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నప్పటికీ నీరసంగా కనిపిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే ఆయనకు ప్లేట్‌లెట్​ల సంఖ్య పడిపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనారోగ్యం దృష్ట్యా చౌదురి చక్కెర మిల్లుల కేసులో షరీఫ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది లాహోర్ హైకోర్టు.

ABOUT THE AUTHOR

...view details