అఫ్గానిస్థాన్‌ను తమ హస్తగతం చేసుకున్న తాలిబన్లు(Afghan Taliban).. మహిళల హక్కులను(afghan women's rights) కాలరాస్తున్నారు. మహిళలపై దాడులు చేస్తూ, తమ సహజ వైఖరిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కాబుల్‌లోని అధ్యక్ష ప్యాలస్ ముందు పలువురు మహిళలు నిరసనలు చేపట్టారు. మహిళల హక్కులను గౌరవించాలని తాలిబన్ల నాయకత్వాన్ని కోరారు. కొత్త ప్రభుత్వంలో మహిళలను భాగస్వాములు చేయాలని సూచించారు.
'మహిళల భాగస్వామ్యంతో వీరోచిత కేబినెట్' అని రాసిన పేపర్లను పట్టుకుని కొంత మంది మహిళలు ప్యాలస్ మొదటి గేటు వద్ద శుక్రవారం నిరసనకు దిగారు. మానవ హక్కులను కాపాడాలని నినాదాలు చేశారు. గతంలోని క్రూరమైన పాలనలోకి తాము వెళ్లాలనుకోవట్లేదని స్పష్టం చేశారు.