తెలంగాణ

telangana

ETV Bharat / international

'మాల్యా 135 మిలియన్ డాలర్లు చెల్లించండి'

లిక్కర్ కింగ్​ విజయ్​ మాల్యా బ్రిటీష్​ పానీయాల దిగ్గజం డియాజియోకు... ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 135 మిలియన్​ డాలర్లు చెల్లించాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశించింది.

'మాల్యా 135 మిలియన్ డాలర్లు చెల్లించండి'

By

Published : May 25, 2019, 7:38 PM IST

పంజాబ్ నేషనల్​ బ్యాంకు రుణాల ఎగవేత కేసులో పరారీలో ఉన్న... లిక్కర్​ టైకూన్ విజయ్ ​మాల్యాకు మరోసారి చుక్కెదురైంది. బ్రిటన్​కు చెందిన​ పానీయాల దిగ్గజం డియాజియోకు... ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 135 మిలియన్​ డాలర్లు చెల్లించాలని యూకే హైకోర్టు ఆదేశించింది.

2016లో నోటి మాట ద్వారా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. విజయ్​ మాల్యా 175 మిలియన్​ డాలర్ల మేర బకాయి పడ్డారని డియాజియో బ్రిటన్​ హైకోర్టులో పిటిషన్​ వేసింది. మూడేళ్ల కిందట మాల్యాకు చెందిన యునైటెడ్​ స్పిరిట్స్​ లిమిటెడ్​లో మెజారిటీ వాటా కొనుగోలు వ్యవహారంలో ఈ సొమ్ము తమకు తిరిగి చెల్లించాల్సి ఉందని ఆ సంస్థ పేర్కొంది.

వాదనలు విన్న జస్టిస్​ రాబిన్​ తన తీర్పులో... 135 మిలియన్​ డాలర్లు చెల్లించాలని మాల్యా కంపెనీకి ఆదేశించారు. ఇందులో మాల్యా నుంచి నేరుగా 40 మిలియన్ డాలర్లు, ఆయన కుమారుడు సిద్ధార్థ మాల్యా నుంచి మిగతా సొమ్ము వసూలు చేయాలని ఆదేశించారు. అయితే మాల్యా ఈ సొమ్ముకి వడ్డీతోపాటు, న్యాయప్రక్రియకైన ఖర్చులు 2 లక్షల పౌండ్లూ చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: డ్రోన్ల డ్యాన్స్​తో ఆకాశంలో జిల్​జిల్ జిగాజిగా

ABOUT THE AUTHOR

...view details