అమెరికా ఉత్పత్తులపై పెంచిన సుంకాలను భారత్ తగ్గించాల్సిందేనని హెచ్చరించిన ఒక్క రోజు వ్యవధిలోనే వెనక్కి తగ్గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ-20 వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. వాణిజ్య పరంగా నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అంగీకరించారు.
జీ-20 సదస్సుకు బయలుదేరేముందు భారత్‌ను హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు ట్రంప్. అమెరికా దిగుమతులపై భారత్ పెంచిన సుంకాలు తగ్గించాల్సిందేనని డిమాండ్ చేశారు. భారత్ అధిక సుంకాలు వసూలు చేయడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఇరు దేశాధినేతల భేటీపై పలు అంశాలను వెల్లడించారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే.