కనీసం 70శాతం మంది మాస్కులు ధరించినా.. కరోనా మహమ్మారిని అడ్డుకోవచ్చని ఓ అధ్యయనం పేర్కొంది. అయితే మాస్కులు రూపొందించిన పదార్థం, దానిని వాడిన సమయంపై మాస్కు ప్రభావం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్లో ఈ పరిశోధన ప్రచురితమైంది. ఫేస్ మాస్కులపై ఇప్పటివరకు ఉన్న అధ్యయనాలను పరిశీలించి, ఎపిడెమైలాజికల్ రిపోర్టులను సమీక్షించి ఈ స్టడీని రూపొందించారు.
"70శాతం ప్రభావవంతంగా పనిచేసే సర్జికల్ మాస్కులను.. బహిరంగ ప్రదేశాల్లో కనీసం 70శాతం మంది ఉపయోగిస్తే కరోనా మహమ్మారిని అరికట్టవచ్చు. వస్త్రాలతో రూపొందించిన మాస్కును ఎప్పటికప్పుడు ధరించినా వైరస్ను కట్టడి చేయవచ్చు."