తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా'.. పాముల ద్వారా కాదు గబ్బిలాల వల్లేవ్యాప్తి! - coronavirus come from where

ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా వైరస్.. గబ్బిలాల నుంచే వ్యాప్తి చెందినట్లు పలు పరిశోధనలు అభిప్రాయపడుతున్నాయి. నేచర్ జర్నల్​లో ప్రచురితమైన రెండు అధ్యయనాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. గతంలో వ్యాపించిన సార్స్​ వైరస్​తో పోలిస్తే కరోనాకు దగ్గరి పోలికలు ఉన్నట్లు గుర్తించాయి.

Coronavirus in China may have come from bats: studies
గబ్బిలాల ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి..!

By

Published : Feb 4, 2020, 6:34 AM IST

Updated : Feb 29, 2020, 2:23 AM IST

'కరోనా'.. పాముల ద్వారా కాదు గబ్బిలాల వల్లేవ్యాప్తి!

చైనాలో ఉద్భవించి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భయంకర మహమ్మారి కరోనా వైరస్.. గబ్బిలాల నుంచే వ్యాపించి ఉండొచ్చని పలు పరిశోధనలు చెబుతున్నాయి. 'నేచర్' జర్నల్​లో ప్రచురితమైన రెండు అధ్యయనాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

మొదటి అధ్యయనంలో ఫుడాన్​ విశ్వవిద్యాలయంలోని యోంగ్​జెన్​ ఝాంగ్​ బృందానికి చెందిన పరిశోధకులు.. వైరస్​కు సంబంధించి జన్యు శ్రేణి పరీక్షలు నిర్వహించారు. సముద్ర ఆహార మార్కెట్​లో పనిచేసే వైరస్ లక్షణాలు ఉన్న ఓ వ్యక్తిపై ఈ పరిశోధన చేశారు. యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, గ్లూకొకోర్టికోయిడ్ థెరపీ వంటి ప్రక్రియలు చేపట్టారు. అయితే ఆ వ్యక్తి ఆరోగ్యం కుదుటపడలేదు. ఆ తర్వాత రోగి ఊపిరితిత్తుల స్రావాన్ని సేకరించి వాటిపై పరిశోధన నిర్వహించారు.

గతంలో చైనాలోనే సంభవించిన సార్స్​ వైరస్​ జన్యువుతో ఈ ప్రమాదకర వైరస్​కు 89.1 శాతం పోలికలు ఉన్నట్లు తేల్చారు. అయితే ఒక్క వ్యక్తిపై చేసిన పరిశోధన ద్వారా దీనిపై పూర్తి అవగాహనకు రాలేమని చెబుతున్నారు పరిశోధకులు.

మరో అధ్యయంలోనూ

నేచర్​ జర్నల్​లో ప్రచురితమైన మరో అధ్యయనం సైతం దాదాపు ఇదే రకమైన ఫలితాలు వెల్లడించింది. కరోనా వైరస్​కు సార్స్​తో పోలికలు ఉన్నట్లు తేల్చింది. కరోనా వైరస్ మూలాలు గబ్బిలాలలో ఉన్నట్లు పేర్కొంది. అయితే వైరస్ వ్యాప్తికి కారణమైన జంతువును గుర్తించలేదని వెల్లడించింది.

వుహాన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ వైరాలజీకి చెందిన ఝెంగ్ లీ షీ బృందం న్యుమోనియా సోకిన ఏడుగురి నమూనాలను సేకరించింది. ఇందులో ఆరుగురు సముద్ర ఆహారం అమ్మే మార్కెట్​లో పనిచేసే వారే కావడం గమనార్హం. వీరందరి నమూనాలు పరీక్షించిన ఝెంగ్​ బృందం ఈ జన్యువుకి సార్స్​ వైరస్​తో 79.5 శాతం పోలిక ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇందులో ఐదుగురి జన్యువులు మరొకరి జన్యువులతో 99.9 శాతం పోలిక ఉన్నట్లు వెల్లడించింది.

సార్స్​ మాదిరిగానే

జన్యు పరంగా గబ్బిలాల కరోనా వైరస్​కు ఈ నమూనాలతో 96 శాతం పోలిక ఉన్నట్లు తేల్చారు పరిశోధకులు. ఈ నేపథ్యంలో గబ్బిలాల నుంచే ఈ వైరస్ ఉద్భవించిందని అభిప్రాయపడుతున్నారు. సార్స్​ వైరస్​లో ఉండే ఏడు నాన్​ స్ట్రక్చరల్ ప్రోటీన్​ల జాడను కూడా ఇందులో గుర్తించినట్లు తెలిపారు. 2019లో దీనిని నావెల్ కరోనావైరస్​గా పిలిచారని... సార్స్​ వైరస్ మాదిరిగానే ఓసీఈ2 కణాల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు.

425 మంది మృతి..

2019 డిసెంబర్​లో చైనాలోని సెంట్రల్ హుబెయి ప్రావిన్స్​లో తొలి కరోనా వైరస్​ కేసు నమోదైంది. అనంతరం క్రమక్రమంగా 25 దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్​ ధాటికి ఇప్పటికే చైనాలో 425 మంది ప్రాణాలు కోల్పోగా... 20,400 మందికిపైగా వైరస్ సోకినట్లు గుర్తించారు. భారత్​లోనూ ముగ్గురికి ఈ వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు.

Last Updated : Feb 29, 2020, 2:23 AM IST

ABOUT THE AUTHOR

...view details