చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా చైనా వెలుపల దాదాపు 17 రెట్ల వేగంతో విస్తరిస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు.. ప్రపంచదేశాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఇరాన్‌లో కరోనా మృతుల సంఖ్య 124కు పెరిగింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 148కి చేరింది. భూటాన్, నెదర్లాండ్స్, వాటికన్ సిటీ, సెర్బియా, కామెరూన్ సహా మరికొన్ని దేశాల్లో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావంతో ఆసియా- పసిఫిక్ దేశాలు ఈ ఏడాదిలో దాదాపు 211 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని చవిచూడనున్నట్లు కొన్ని ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి.
దాదాపు 87 దేశాలను చుట్టేసిన కొవిడ్-19 దాదాపు 3 వేల 385 మందికిపైగా ప్రాణాలు బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య దాదాపు లక్ష(98,123)కి చేరువైంది. పరిస్థితి చాలా ఘోరంగా ఉందని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో).యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించింది. ఐరోపా, అమెరికాలో ఒక్క సారిగా మరణాలు, కరోనా కేసులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో కరోనాను ఎదుర్కోవడంలో సరైన సన్నద్ధత కనబరచక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడింది. ఈ కారణంగానే ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, ఇరాన్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా మరణాల రేటును తక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది.
పెరుగుతున్న మరణాలు..