ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది ఐరోపా సమాఖ్య. కశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛతో పాటు అక్కడ సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొల్పడం ఎంతో అవసరమని భారత్లోని ఈయూ రాయబారి యుగో అస్టుటో ఓ ప్రకటనలో తెలిపారు. యురోపియన్ పార్లమెంట్ సభ్యులు కశ్మీర్లో పర్యటించడమంటే.. ఈయూ పాలసీ నిర్ణయాన్ని వెల్లడించినట్లు కాదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : రూ.2 కోట్లు పన్ను కట్టాలని 'దేవుడి'కి ఐటీ నోటీసులు