తెలంగాణ

telangana

ETV Bharat / international

పబ్​జీకి ఎదురుదెబ్బ.. చైనాలో అనుమతి నిరాకరణ - పబ్​జీ ఆట

దేశంలో పబ్​జీ గేమ్​ను విడుదల చేసేందుకు అనుమతిని నిరాకరించింది చైనా. అందుకే ఆ దేశంలో పబ్​జీ విడుదలను విరమించుకుంటున్నట్టు ప్రకటించింది టెన్​సెంట్​ సంస్థ. అయితే ఇదే ఆటను పోలిన మరో గేమ్​ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఇంతకాలం చైనాలో పబ్​జీ టెస్టింగ్​ వర్షెన్​ మాత్రమే అందుబాటులో ఉండేది.

పబ్​జీకి ఎదురుదెబ్బ.. చైనాలో అనుమతి నిరాకరణ

By

Published : May 9, 2019, 5:50 AM IST

ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పబ్​జీ గేమ్​కు చైనాలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన పరీక్షల్లో పబ్​జీ విఫలమైంది. అందుకే చైనా పబ్​జీ విడుదలను విరమించుకుంటున్నట్టు వెల్లడించింది ఆ గేమ్​ను నిర్వహిస్తున్న టెన్​సెంట్​ సంస్థ.

ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది పబ్​జీ మొబైల్​ గేమ్​. అయితే హింసాత్మక ధోరణి పెరిగిపోతుందన్న కారణంతో ఇరాక్​, నేపాల్​ దేశాలతో సహా భారత్​లోని గుజరాత్​ రాష్ట్రం పబ్​జీని నిషేధించింది.

పబ్​జీ.. ఇక గేమ్​ ఫర్​ పీస్​

పబ్​జీని దక్షిణ కొరియాకు చెందిన బ్లూహోల్​ సంస్థ ద్వారా ఏడాది క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది టెన్​సెంట్. అయితే చైనాలో మాత్రం టెస్టింగ్​ వెర్షన్​ మాత్రమే విడుదలైంది. అయితే తాజాగా పబ్​జీకి ఆ దేశ ప్రభుత్వ ఆమోదం లభించలేదు.

పబ్​జీకి కొన్ని మార్పులు చేసి "గేమ్​ ఫర్ పీస్" పేరుతో గేమ్​ను రూపొందించింది టెన్​సెంట్​. ఈ గేమ్​ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చని చైనీయులకు సూచించింది. చైనా వైమానిక దళ సూచనలతో ఈ నూతన గేమ్​ను రూపొందించారు.

ఇదీ చూడండి: ప్రఖ్యాత ఏనుగు పార్థన్​ మృతి- మావటి కన్నీరు

ABOUT THE AUTHOR

...view details