తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో మళ్లీ కరోనా విజృంభణ- కొత్తగా 63 కేసులు - Covid-19 latest news

చైనాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తాజాగా 63మంది వైరస్ బారినపడ్డారు. మొత్తంగా చైనాలో బాధితుల సంఖ్య 1104కు చేరింది. గురువారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. లక్షణాలు లేకుండా వ్యాపించే దొంగ వైరస్​ కేసుల్లోనూ పెరుగుదల నమోదైంది.

china
చైనాలో కరోనా 2.0.. కొత్తగా 63మందికి వైరస్

By

Published : Apr 9, 2020, 10:55 AM IST

కరోనా వైరస్ ప్రభావం చైనాలో మళ్లీ పెరుగుతోంది. తాజాగా 63 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ప్రస్తుతం 1,104 మంది వైరస్​తో బాధపడుతున్నారు. గురువారం మహమ్మారి బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ మరణాల సంఖ్య 3,335కు చేరింది. మొత్తంగా 81,865 మంది దేశంలో వైరస్ బారినపడ్డారు. మరో 73మంది అనుమానితులను పరిశీలిస్తున్నారు.

మూడు నెలల అనంతరం..

జనవరి నుంచి మూడు నెలలపాటు వైరస్​పై తీవ్ర పోరాటం చేసిన అనంతరం చైనాలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వుహాన్​లో లాక్​డౌన్​ ఎత్తేశారు. వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి చైనాకు వెళ్లినవారి ద్వారా వైరస్ కేసులు పెరగడం అక్కడి అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

దొంగ వైరస్​లోనూ పెరుగుదల..

కరోనా లక్షణాలు కనిపించకుండా సోకే దొంగ వైరస్ కేసులు 56 నమోదయ్యాయి. ఇందులో 28 మంది విదేశాల నుంచి చైనాకు వెళ్లినవారు ఉన్నారు.

'లాక్​డౌన్ ఎత్తివేత దశల వారీగా'

చైనాలో రెండోసారి వైరస్ విజృంభించకుండా అరికట్టాలంటే లాక్​డౌన్​ను దశల వారిగా ఎత్తివేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వుహాన్​లో ఆంక్షల తొలగింపు నేపథ్యంలో హాంకాంగ్​కు చెందిన పరిశోధకులు ఈ వ్యాఖ్యలు చేశారు. భౌతిక దూరం నిబంధనలను పాటించకుంటే నగరంపై మరోసారి వైరస్ పంజా విసిరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇదీ చూడండి:హేమాహేమీల్నీ వదలని కరోనా.. ఎవరెవరంటే?

ABOUT THE AUTHOR

...view details