తెలంగాణ

telangana

ETV Bharat / international

'షాదీ మాటే వద్దు గురూ- సోలో లైఫే సో బెటరూ'

చైనా యువత పెళ్లిపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అనేక మంది వివాహానికి పూర్తిగా నిరాకరిస్తున్నారు. లేదా వాయిదా వేస్తున్నారు. పిల్లల విద్య మొదలు ఇతర ఖర్చులన్నీ పెరిగిపోవడం ఇందుకు ఒక కారణం.

'షాదీ వద్దు గురూ- సోలో లైఫే సో బెటరూ'

By

Published : Apr 7, 2019, 7:31 AM IST

Updated : Apr 7, 2019, 10:19 AM IST

"ఎందుకే రమణమ్మా.... పెళ్లెందుకే రమణమ్మా... తాను దూర సందు లేదు మెడకేమో డోలా...".... ఓ తెలుగు సినిమాలో పాట ఇది. చైనా యువత నిజం జీవితంలో ఇలాంటి పాటలే పాడుకుంటోంది.

చైనా యువతలో ఒంటరి జీవితాన్ని ఇష్టపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. వీరు పెళ్లిని శాశ్వతంగా నిరాకరిస్తున్నారు. లేదా వాయిదా వేస్తున్నారు. వరుసగా ఐదో ఏడాది దేశంలో వివాహ రేటు తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం.

2013లో వివాహ రేటు 9.9. అంటే 10వేల మందిలో 99 మంది పెళ్లి చేసుకునే వారు. ఇది 2018లో 72కు పడిపోయింది. ఇది ప్రాంతాలను బట్టి మారుతోంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ రేటు తక్కువగా ఉంది.

"పెళ్లి చేసుకుని తక్కువ స్థాయి జీవితం గడిపే కంటే ఒంటరిగా ఉండి నాణ్యమైన జీవితాన్ని గడిపేందుకు నేను ప్రాధాన్యం ఇస్తాను" అని యువత అభిప్రాయపడుతున్నట్లు అక్కడి మీడియా సంస్థ తెలిపింది.

1980 నుంచి 1990 మధ్య జన్మించిన వారిలో వివాహం, పిల్లలను కనటం వంటి వాటిపై అభిప్రాయం మారుతోంది. మారుతున్న సమాజంలో వివాహం అనేది తప్పనిసరి కాదు.
- లూ లు జీయువా, ఆచార్యులు, పెకింగ్​ విశ్వవిద్యాలయం

2012కు ముందు మరోలా...

2012 కంటే ముందు 20 నుంచి 24 ఏళ్ల వారి విహహ నమోదు రికార్డు స్థాయిలో ఉండేది. 2017 నుంచి ఈ స్థానాన్ని 25 నుంచి 29 ఏళ్ల వారు భర్తీ చేశారు. ఇప్పుడు మొత్తం వివాహ నమోదులో వీరే 36.9 శాతం.

Last Updated : Apr 7, 2019, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details