కరోనా సంక్షోభం నుంచి చైనా ఆర్థిక వ్యవస్థ ఆశ్చర్యకర స్థాయిలో తేరుకుంటోంది. జులై-సెప్టెంబర్ మధ్య చైనా వృద్ధి రేటు 4.9 శాతంగా నమోదైనట్లు చైనా జాతీయ గణాంకాల సంస్థ సోమవారం ప్రకటించింది.
మార్చి నాటికి కరోనా వైరస్ అదుపులోకి వచ్చిందని.. ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపార సముదాయాలు తెరుచుకునేందుకు చైనా ప్రభుత్వం అనుమతులిచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధించినట్లు తెలిపింది చైనా జాతీయ గణాంకాల సంస్థ.
"ముఖ్యంగా మాస్కులకు, ఇతర వైద్య పరికరాలకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. చైనా ఫ్యాకర్టీల ఉత్పాదన పెరిగింది. తయారీ కర్యకాలపాలతో పోలిస్తే వెనుకబడిన రిటైల్ విక్రయాలు కూడా చివరకg కరోనా ముందు స్థాయికి చేరాయి" అని వివరించింది.
మొత్తంగా చైనా ఆర్థిక వ్యవస్థ స్థిరమైన రికవరీ సాధిస్తున్నట్లు తెలిపింది జాతీయ గణాంకాల సంస్థ. అయితే అంతర్జాతీయ పరిణామాలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు పేర్కొంది. దీనితో కొవిడ్ సంక్షోభం నుంచి తేరుకోవడంలో చైనా ఇంకా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు వివరించింది.
ఇదీ చూడండి:మరో అరబ్ దేశంతో ఇజ్రాయెల్ 'దోస్తీ'