తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా మృత్యుఘోష: 1500లకు చేరువలో మృతుల సంఖ్య

చైనాను కరోనా వైరస్ వణికిస్తోంది. అంచనాలకు అందకుండా వేగంగా విస్తరిస్తూ.. వందలమంది ప్రాణాలను బలిగొంటోంది. గురువారం ఒక్కరోజునే 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి ధాటికి మరణించిన వారి సంఖ్య 1500లకు చేరువలో ఉంది.

China's coronavirus death toll nears 1,500
కరోనా మృత్యుఘోష

By

Published : Feb 14, 2020, 1:03 PM IST

Updated : Mar 1, 2020, 7:56 AM IST

కరోనా మృత్యుఘోష: 1500లకు చేరువలో మృతుల సంఖ్య

కొవిడ్​-19 (కరోనా).. చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న మహమ్మారి. చైనాలో వేగంగా వ్యాపిస్తూ వందల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. వేల మంది ఈ వైరస్​ బారిన పడి చికిత్స పొందుతున్నారు.

గురువారం ఒక్క రోజునే 121 మంది ప్రాణాలు కోల్పోవటం వల్ల మొత్తం మృతుల సంఖ్య సుమారు 1500లకు చేరుకుందని ఆ దేశ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. తాజాగా మరో 5,090 మందికి వైరస్​ సోకిన కారణంగా మొత్తం వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 65,000లకు చేరినట్లు వెల్లడించింది.

కరోనా వెలుగులోకి వచ్చిన హుబే రాష్ట్రం​లో గురువారం 116 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 4,823 మందికి వైరస్​ సోకింది. హేయిలాంగ్​జియాంగ్​లో ఇద్దరు​, అన్హూయ్​, హెనాన్​, చాంగ్​కింగ్​ రాష్ట్రాల్లో ఒకరి చొప్పున మరణించారు.

చైనాకు అంతర్జాతీయ మిషన్​..

వైరస్​ను గుర్తించేందుకు నూతన పద్ధతిని అనుసరిస్తున్న క్రమంలో వైరస్​ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్​ఓ​) పేర్కొంది. ఇప్పటికే డబ్ల్యూహెచ్​ఓకు చెందిన 15 మంది సభ్యుల బృందం చైనాలో పర్యటిస్తోంది. ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని అంతర్జాతీయ మిషన్​ ఈ వారం చివర్లో చైనాకు వెళ్లే అవకాశం ఉందని ఆ సంస్థ అధినేత మైఖేల్ ర్యాన్ తెలిపారు.

ఇదీ చూడండి:ఇరాన్​పై ట్రంప్​ సైనికాధికారాలకు సెనేట్​ అడ్డుకట్ట!

Last Updated : Mar 1, 2020, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details