తెలంగాణ

telangana

ETV Bharat / international

'' కొత్త నాటకానికి తెరతీసిన పాక్​ ప్రభుత్వం​'' - పాకిస్థాన్​

పాకిస్థాన్​పై మరోమారు దాడులు చేసేందుకు భారత్​ ప్రణాళిక చేస్తోందని పాకిస్థాన్​ ఆరోపించింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నెల 16 నుంచి 20 తేదీల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని పాక్​ విదేశాంగ మంత్రి మహమూద్​ ఖురేషీ పేర్కొన్నారు.

పాక్​పై మరోమారు దాడులకు భారత్​ ప్రణాళిక: ఖురేషీ

By

Published : Apr 7, 2019, 9:18 PM IST

పాకిస్థాన్​ తన వక్రబుద్ధి చూపిస్తూనే ఉంది. మరోసారి భారత్​పై ఆరోపణలు చేశారు ఆ దేశ విదేశాంగ మంత్రి మహమూద్​ ఖురేషీ. ఆ దేశంపై మరోమారు దాడులు చేసేందుకు భారత్​ ప్రణాళిక చేస్తోందని ఆరోపించారు. నిఘావర్గాల సమాచారం మేరకు ఈ నెల 16 నుంచి 20 తేదీల మధ్య దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ముల్తాన్​లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన ఖురేషీ.. ఈ మేరకు భారత్​పై ఆరోపణలు చేశారు. కానీ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు.

భారత్​పై పాక్​ ఆరోపణలు

" భారత్​ కొత్త ప్రణాళిక చేస్తోందని మాకు పక్కా సమాచారం ఉంది. ఇది భయంకరమైన పరిస్థితి. వారు కొత్త దాడులకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 16 నుంచి 20 తేదీల మధ్య దాడులకు అవకాశం ఉంది. పాకిస్థాన్​కు చెందిన ఏ ఒక్క ఎఫ్​-16 జెట్​కు ఎలాంటి ప్రమాదం జరగలేదని అమెరికా తేల్చింది. అది ప్రపంచమంతా తెలుసు. ఫారెన్​ పాలసీ మ్యాగజైన్​లో ప్రచురించింది."

- మహమూద్​ ఖురేషీ, పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముష్కర చర్యకు సమాధానంగా ఫిబ్రవరి 26న పాకిస్థాన్​లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది భారత్​. కానీ పాక్​ దానిని తోసిపుచ్చింది. కేవలం అడవిలోని చెట్లను దెబ్బతీశారని పేర్కొంది.

ఖురేషీ వ్యాఖ్యలను తేలికగా తీసుకుంది పాక్​ ప్రతిపక్షం. ఆ​ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ (పీపీపీ). తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే భారత్​ నుంచి యుద్ధ భయం ఉందంటోందని పేర్కొంది. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల నుంచి ప్రజలను దారి మళ్లించేందుకే కొత్త దారులు చూస్తోందని ఆరోపించింది.

ABOUT THE AUTHOR

...view details