తెలంగాణ

telangana

ETV Bharat / international

"కలిసి పోరాడండి" - చైనా

దాయాది దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడాలని చైనా పిలుపునిచ్చింది. భారత వాయుసేన పైలట్​ను పాక్​ విడుదల చేయడాన్ని స్వాగతించింది.

భారత్​-పాక్​ కలిసి ఉగ్రవాదంపై పోరాడాలి: చైనా

By

Published : Mar 1, 2019, 7:51 PM IST

భారత్ పైలట్​ అభినందన్​ను పాకిస్థాన్​ విడుదల చేయడాన్ని చైనా స్వాగతించింది. ఉగ్రవాద నిర్మూలనకు రెండు దేశాలు కలిసి కృషి చేయాలని అభిలషించింది.

"ఉద్రిక్తతలు తగ్గించడానికి దాయాది దేశాలు కృషి చేయాలని చైనా మొదటి నుంచి కోరుతోంది. చర్చల ద్వారా మాత్రమే భారత్​-పాక్ సమస్యలు పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. భారత్​-పాక్ కలిసి ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలి. తద్వారా ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు పాటుపడాలని చైనా అభిలషిస్తోంది."
-లూ కాంగ్​, చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

బీజింగ్​లో నిర్వహించిన భారత్​, రష్యా, చైనా విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ చైనా ఇవే అభిప్రాయాలను వ్యక్తంచేసింది.

మేము ఎన్నడూ గుర్తించలేదే!

భారత్​, పాకిస్థాన్​లను తాము ఎన్నడూ అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశాలుగా గుర్తించలేదని చైనా స్పష్టం చేసింది. ఉత్తర కొరియాను మాత్రం అణ్వస్త్ర దేశంగా గుర్తించామని తెలిపింది.

"భారత్, పాక్​ను అణ్వస్త్ర దేశాలుగా చైనా ఎన్నడూ గుర్తించలేదు. ఈ విషయంపై చైనా అభిప్రాయం ఎప్పుడూ స్థిరంగానే ఉంది."

-లూ కాంగ్​, చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

వియత్నాంలో అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు ట్రంప్​, కిమ్​ల మధ్య చర్చలు అర్థంతరంగా ముగియడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు లూ కాంగ్​ ఇలా స్పందించారు.

అణు సరఫదారుల బృందం-ఎన్​ఎస్​జీలో భారత్​కు సభ్యత్వం రాకుండా ఎప్పటి నుంచో చైనా అడ్డుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details