చైనా మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. తమ భూభాగాన్ని తప్పుగా చూపించారనే కారణంతో సుమారు 3 లక్షల ప్రపంచ పటాలను ధ్వంసం చేయాలని ఆదేశించింది. అరుణాచల్‌ప్రదేశ్, తైవాన్లను చైనా పటంలో చేర్చకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చైనా గువాంగ్‌డోంగ్ రాష్ట్రం డోంగువాన్లో ఓ సంస్థ 3,06,057 ప్రపంచ పటాలు రూపొందించింది. వీటిని నెదర్లాండ్స్‌కు ఎగుమతి చేసేందుకు యత్నించిన నలుగురిపై చైనా కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు.ఈ పటాలు చైనా ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆ దేశం చెబుతోంది.
గత నెలలో చైనా, భారత్ సరిహద్దులను తప్పుగా చూపించారని, తైవాన్ను ప్రత్యేక దేశంగా ముద్రించారనే కారణంగా 30 వేల పటాలను డ్రాగన్ దేశం నాశనం చేసింది.