హాంకాంగ్ నిరసనకారులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాశ్రయంలోని తమ దేశ పౌరులపై 'ఉగ్రవాద తరహా' దాడులకు పాల్పడ్డారంటూ ఆక్రోశం ప్రదర్శించింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఇప్పటికే హాంకాంగ్ సరిహద్దుల్లో తన సేనలను మోహరించింది చైనా. డ్రాగన్ చర్యపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 'చైనాకు ఖైదీల అప్పగింత బిల్లు'ను వ్యతిరేకిస్తూ హాంకాంగ్ పౌరులు చేస్తున్న నిరసనలకు అగ్రరాజ్యం బాసటగా నిలిచింది.
హాంకాంగ్ నిరసనకారులపై డ్రాగన్ కన్నెర్ర - అమెరికా
హాంకాంగ్ నిరసనకారులు విమానాశ్రయంలో ఇద్దరు చైనా పౌరులపై దాడిచేశారు. ఈ చర్యను ఖండించిన చైనా ఆందోళనకారులు ఉగ్రవాద తరహా దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హాంకాంగ్ సరిహద్దులకు తన సైనిక దళాలను తరలించింది. డ్రాగన్ చర్యపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
హాంకాంగ్ నిరసనకారులపై డ్రాగన్ కన్నెర్ర
నిరసనకారులు రెండు రోజుల పాటు హాంగ్కాంగ్ విమానాశ్రయాన్ని దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. ఫలితంగా చాలా విమానసర్వీసులను అధికారులు నిలిపివేశారు. చివరకు ఆందోళనకారులు ఇద్దరు చైనా పౌరులను చితకబాదారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను నిలువరించారు.
ఇదీ చూడండి: కశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని అక్కసు
Last Updated : Sep 27, 2019, 1:44 AM IST