తెలంగాణ

telangana

ETV Bharat / international

తైవాన్​ను దెబ్బతీసేందుకు చైనా 'పైనాపిల్​' కుతంత్రం! ​ - తైవాన్ పైనాపిల్

పొరుగు దేశాల పట్ల చైనా మరింత కుటిల విధానాలను అవలంబిస్తోంది. తైవాన్​ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఆ దేశం నుంచి పైనాపిల్​ దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో డ్రాగన్ దేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైనాపిల్ రైతులను ఆదుకోవాలని అక్కడి ప్రముఖులు కోరుతున్నారు.

China sinks to new low; bans Taiwan-grown Pineapples
మరింత దిగజారిన చైనా.. తైవాన్ పైనాపిల్​పై నిషేధం

By

Published : Feb 28, 2021, 4:57 PM IST

తైవాన్​పై అధికారం చెలాయించేందుకు మరో కుతంత్రానికి తెరతీసింది చైనా. ఆ దేశంలో పండే పైనాపిల్​ దిగుమతులను నిషేధం విధించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు తైవాన్​లోని ప్రముఖులు. తైవాన్ పైనాపిల్ రైతులను ఆదుకోవాల్సిందిగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలను కోరుతున్నారు.

తైవాల్​ పైనాపిల్​ దిగుమతులపై మార్చి 1 నుంచి నిషేధం అమల్లో ఉంటుందని చైనా కస్టమ్స్​ విభాగం ప్రకటించింది. 2020లో తైవాన్​ నుంచి వచ్చిన కొన్ని బ్యాచ్​ల పైనాపిల్​లలో పిండి పురుగులను గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకుంటున్నట్లు చెప్పింది.

అయితే తరచుగా చైనాను విమర్శించే డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) లక్ష్యంగా చైనా ఈ మేరకు వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిని 'కుతంత్ర' చర్యగా తైవాన్ అభివర్ణించింది.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..

పైనాపిల్​ విక్రయాలను ప్రోత్సాహించడానికి తైవాన్ ప్రభుత్వం సుమారు రూ.260కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. దేశీయ పైనాపిల్ ఉత్పత్తిదారులను ఆదుకోవడానికి అధ్యక్షుడు సై ఇంగ్​ వెన్​, ఉపాధ్యక్షుడు విలియమ్ లై స్వయంగా వాటిని వినియోగిస్తున్నారని అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి జేవియర్ చాంగ్ తెలిపారు.

తైవాన్ ప్రతి ఏటా 4.2లక్షల టన్నుల పైనాపిల్​లను ఉత్పత్తి చేస్తుంది. ఏడాది కాలంగా చైనాకు పంపిన 6 వేల 200 బ్యాచుల్లో కేవలం 13 బ్యాచులు (141 టన్నులు) మాత్రమే నాణ్యతా పరీక్ష విఫలమయ్యాయని చాంగ్ తెలిపారు. అంటే 99.79 శాతం అర్హత సాధించాయని వివరించారు.

ఆపన్నహస్తం..

విధానపరమైన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి వాణిజ్యాన్ని వాడుకునే చరిత్ర చైనా కుతంత్రం నుంచి పైనాపిల్ ఉత్పత్తిదారులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు వస్తున్నారు. దాదాపు రూ.13లక్షల పైనాపిల్​లను కొని తన జిమ్​లలో పంచిపెడతానని ఇంటర్నెట్ సెలబ్రిటీ హోల్గర్ చెన్ ప్రకటించారు. తైవాన్ ప్రజలను కవ్వించరాదని చైనాను హెచ్చరించారు.

చైనా నిర్ణయం తైవాన్ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని కీలుంగ్ మేయర్ లిన్​యు చాంగ్ విమర్శించారు. పైనాపిల్​ ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని డీపీపీ నేత చెంగ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి న్యూతైవాన్ డాలర్​తో పైనాపిల్​లను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:అసోంలో 1.08 లక్షల అనుమానిత ఓటర్లు

ABOUT THE AUTHOR

...view details