తెలంగాణ

telangana

ETV Bharat / international

'వైరస్​ పుట్టుకపై అమెరికా రాజకీయం' - వైరస్​ పుట్టుకపై చైనా

కరోనా వైరస్​ ఆవిర్భావంపై అమెరికా రాజకీయం చేస్తోందని చైనా ఆరోపించింది. అమెరికా ముందు తమ దేశంలోని ల్యాబ్​లపై దర్యాప్తు చేపట్టాలని విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ వ్యాఖ్యానించారు.

zhao lijian image
జావో లిజియాన్, విదేశాంగ ప్రతినిధి

By

Published : May 27, 2021, 5:37 PM IST

కరోనా వైరస్​ పుట్టుకను అమెరికా రాజకీయం చేస్తోందని చైనా ఆరోపించింది. వైరస్​ ఆవిర్భావంపై దర్యాప్తు చేపట్టేందుకు అమెరికా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో బైడెన్​ బృందంపై విమర్శలు గుప్పించింది.

"అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలను గమనిస్తే.. అమెరికాకు నిజానిజాలతో పనిలేదని అర్ధమవుతోంది. శాస్త్రీయంగా వైరస్​ మూలాలు తెలుసుకునేందుకు అమెరికా ఆసక్తి చూపడం లేదు," అని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ ఆరోపించారు.

ఎలాగైనా వైరస్​ పుట్టుక గురించి తెలుసుకోవాలని బైడెన్​ తమ నిఘా బృందానికి ఇటీవలే ఆదేశాలిచ్చారు. వూహాన్​ ల్యాబ్​ మిస్టరీని కనుక్కునేందుకూ వెనకాడొద్దని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జావో వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా ముందు తమ దేశంలోని ల్యాబ్​లపై దర్యాప్తు చేయాలని జావో అన్నారు. తొలుత మిలిటరీ ఫోర్ట్ డెట్రిక్​ బేస్​ ల్యాబ్​ను పరీక్షించాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details