తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ దేశంలో కరోనా టీకా ఉచితం

కొవిడ్​ వాక్సిన్​ను తమ ప్రజలకు ఉచితంగా ఇవ్వనున్నట్లు చైనా ప్రకటించింది. ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలలో చైనా టీకాల వల్ల యాంటీ బాడీలు అధికంగా ఉత్పత్తి అయ్యాయని పేర్కొంది. చైనా వాక్సిన్​లు సురక్షితమని దీంతో తేలిందని స్పష్టం చేసింది. అయితే బ్రిటన్​లో పుట్టిన కొత్త కరోనా మీద కూడా తమ టీకాలు పనిచేస్తాయని ధీమా వ్యక్తం చేసింది.

China says COVID shots will be free in country
ఆ దేశంలో కరోనా టీకా ఉచితం

By

Published : Jan 10, 2021, 9:24 AM IST

తమ దేశ ప్రజలకు.. కరోనా టీకాను ఉచితంగా ఇవ్వనున్నట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ వైస్​ డైరక్టర్ ఓ ప్రకటనలో​ వెల్లడించారు.

"కరోనా వాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వనున్నాం. అయితే ముందుగా.. వైరస్​ ముప్పు అధికంగా ఉన్నవాళ్లకి, సాధారణ ప్రజలకు టీకాను పంపిణీ చేస్తాం. టీకా పంపిణీ ప్రక్రియను ఎప్పటినుంచి మొదలు పెడతామో తెలియదు. అది టీకాలు ఉత్పత్తి చేసే కంపెనీలపై ఆధారపడి ఉంటుంది."

-జెంగ్​​ యూక్సింగ్​, చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ వైస్​ డైరక్టర్

అయితే ట్రైయల్స్​లో భాగంగా.. డిసెంబర్​15 నుంచి ఇప్పటి వరకు 90 లక్షల మందికి టీకాను ఇచ్చినట్లు జెన్​ తెలిపారు. దీంతో చైనా టీకాలు సురక్షితమని తేలిందని పేర్కొన్నారు. చైనా టీకాలన మానవుల మీద, కోతుల మీద ప్రయోగించగా పెద్ద మొత్తంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు వెల్లడించారు. యూకేలో పుట్టిన కొత్తరకం కరోనా మీద కూడ తమ దేశ టీకాలు సమర్థంగా పనిచేస్తాయని తెలిపారు.

ఇదీ చూడండి:'మోదీజీ.. దేశమంతా టీకా ఉచితంగా ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details