ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన చైనాలో.. జనాభా పెరుగుదల క్రమక్రమంగా సున్నాకు సమానంగా చేరుకుంటోంది. అతి తక్కువ మందికి పిల్లలు ఉండడం కారణంగా ఈ దశబ్దంలో వృద్ధి రేటు సున్నాకు దగ్గరైందని ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిపోతున్న వృద్ధులతో కార్మికశక్తి తగ్గిపోతుందని వివరించింది.
గడిచిన పదేళ్ల కాలంలో 7కోట్ల 20 లక్షల మంది పుట్టగా.. దీంతో మొత్తం జనాభా 141 కోట్ల 10 లక్షలకు చేరిందని ఆ దేశ జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించింది. అయితే వార్షిక వృద్ధిరేటు 0.53 శాతానికే పరిమితమైనట్లు పేర్కొంది. గత దశాబ్దంతో పోల్చుకుంటే చాలా తక్కువ నమోదు కావడం గమనార్హం.