కరోనా బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాలో కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆ దేశ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తి తగ్గిందని లాక్డౌన్ ఎత్తివేశాక మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలోనే అత్యధికంగా 99 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో 97 కేసులు విదేశాల నుంచి చైనా వచ్చినవే అని పేర్కొంది.
కొత్తగా నమోదైన కేసులలో 63 మందికి వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా పాజిటివ్‌గా తేలినట్లు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. వీరిలో 12మంది విదేశీయులున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు ఈ తరహా కేసులు 1,086 నమోదైనట్లు వివరించింది.
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను రెండున్నర నెలల తర్వాత ఇటీవలే ఎత్తివేసింది చైనా ప్రభుత్వం. మళ్లీ వైరస్ తీవ్రరూపం దాల్చకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచిస్తోంది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, అవసరమైతే తప్పక ఇళ్లను వీడటం వంటివి కచ్చితంగా పాటించాలని స్పష్టం చేస్తోంది.
అగ్రరాజ్యం కుదేలు..