తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో 3199కి చేరిన కరోనా మృతులు - చైనాలో కరోనా మరణాలు

చైనాలో కరోనా వైరస్​ కారణంగా మరో 10 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. దీంతో ఆదేశంలో మరణాల సంఖ్య 3,199కు చేరింది. కొత్తగా మరో 20 కేసులు నమోదయ్యాయి. ఇటీవలి గణాంకాలతో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.

China reports 20 new virus cases, jump in 'imported' infections
చైనాలో మరో 20 మందికి కరోనా

By

Published : Mar 15, 2020, 9:53 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే వైరస్​ను మొదటగా గుర్తించిన చైనాలో తగ్గుముఖం పడుతోంది. చైనాలో తాజాగా 20మందికి కరోనా సోకింది. గత వారం రోజుల్లో శనివారమే అత్యధిక కేసులు నమోదు కావటం గమనార్హం. వైరస్ కారణంగా శనివారం 10 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఇప్పటివరకు చైనాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 3,199కి చేరింది.

బీజింగ్​, షాంఘై ప్రాంతాలతో సహా మొత్తం ఐదు చోట్ల తాజా కేసులు నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. వీటిలో కేవలం నాలుగు కేసులు మాత్రమే హుబే ప్రాంతానికి చెందినవని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కరోనా మృతదేహాలను ఏం చేస్తారు?

ABOUT THE AUTHOR

...view details