తెలంగాణ

telangana

ETV Bharat / international

కొత్త కేసులతో గుబులు- వుహాన్​లో అందరికీ పరీక్షలు - china corona news in telugu

నెల రోజుల వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుంచి వుహాన్​లో కొత్త కరోనా కేసులు పుట్టుకొస్తున్నాయి. తాజాగా నేడు 15 కేసులు నమోదయ్యాయి. దీంతో, నగరంలోని ఒక కోటి 10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.

China reports 15 new COVID19 cases as Wuhan gears up to test its 11 million people
కొత్త కేసులతో.. వుహాన్​లో కోటి మందికి కరోనా పరీక్షలు!

By

Published : May 13, 2020, 11:34 AM IST

ఏప్రిల్​ 8న లాక్‌డౌన్ ఎత్తి వేసి.. దాదాపు సాధారణ స్థితికి చేరుకున్న చైనా వుహాన్​లో కొత్త కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా నగరంలో మరో 15 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. అందులో 8 మందికి కొవిడ్ లక్షణాలు కనిపించకుండానే వైరస్​ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. నగరంలోని మొత్తం జనాభా ఒక కోటి పది లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించింది.

కొత్తగా నమోదవుతున్న కేసుల్లో సగం మందికి పైగా ఎలాంటి లక్షణాలూ కనిపించట్లేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ పేర్కొంది. దీంతో, వారిద్వారా ఎంత మందికి కరోనా సోకిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇప్పటివరకు వుహాన్​లోనే లక్షణాలు కనిపించకుండా 598 కేసులు నమోదయ్యాయి. అందుకే నగరంలో 10 రోజుల పాటు ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం.

ప్రస్తుతం చైనాలో మొత్తం కేసుల సంఖ్య 82,926కు చేరింది. మృతుల సంఖ్య 4,633గా ఉంది.

ఇదీ చదవండి:'20 ఏళ్లలో చైనా నుంచి 5 మహమ్మారులు'

ABOUT THE AUTHOR

...view details