తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాపై 120 దేశాల ఒత్తిడి.. వైరస్​​పై దర్యాప్తునకు అంగీకారం - 120 countries backs eu resolution

కరోనా వైరస్ మూలాన్ని కనుగొనేందుకు సమగ్ర దర్యాప్తు జరగాలని ప్రపంచ దేశాలు చేస్తోన్న ఒత్తిడికి.. చైనా ఎట్టకేలకు తలొగ్గింది. విచారణ చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సదస్సులో ఐరోపా సమాఖ్య ప్రవేశ పెట్టిన ముసాయిదా తీర్మానానికి మద్దతు తెలిపింది.

China relents on opposition to COVID-19 origin probe
ఒత్తిడికి తలొగ్గిన చైనా-వైరస్​పై దర్యాప్తు తీర్మానానికి మద్దతు

By

Published : May 18, 2020, 7:34 PM IST

కరోనా మహమ్మారి పుట్టు పూర్వోత్తరాలపై సమగ్ర విచారణ జరగాలని అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఎప్పటి నుంచో డిమాండ్​ చేస్తున్నాయి. చైనా మాత్రం దీనికి అంగీకరించలేదు. తాజాగా ప్రపంచ దేశాల ఒత్తిళ్లతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. వైరస్ మూలాలపై దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సదస్సు(డబ్ల్యూహెచ్​ఏ)లో ఐరోపా సమాఖ్య ముసాయిదా ప్రవేశ పెట్టగా.. ఆ తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది చైనా. విచారణకు అంగీకారం తెలిపింది.

డబ్ల్యూహెఏ 73వ వార్షిక సదస్సు రెండు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా వైరస్​ మూలాలు కనుగొనాలనే ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది బ్రిటన్​. దీనికి భారత్​ సహా 120 దేశాలు మద్దతు తెలిపాయి. డబ్ల్యూహెచ్​ఏ ఎగ్జిక్యూటివ్​ బోర్డు బాధ్యతల్ని భారత్​ చేపట్టే అవకాశముంది. ఇందులో జపాన్ స్థానాన్ని భర్తీ చేయనుంది.

చైనా స్పందన ఇదే...

ముసాయిదా తీర్మానంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావ్ లిజియన్ స్పందించారు. సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతోనే తీర్మానానికి మద్దుతు పలికినట్లు పేర్కొన్నారు. ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ, ఆహార వ్యవసాయ సంస్థల సహకారంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారణ చేపట్టాలని ఆయా దేశాల ప్రతినిధులు సూచించినట్లు తెలిపారు. వైరస్ ఏ జంతువు నుంచి ఉద్భవించింది? ఏలా వ్యాప్తి చెందింది? అనే విషయాలపై సమగ్ర విచారణ జరిగితే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను నిర్మూలించే అవకాశముంటుందన్నారు.

వైరస్​ పుట్టుకపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని గతంలో అమెరికా, ఆస్ట్రేలియా చేసిన డిమాండ్లను వ్యతిరేకించింది చైనా. కానీ తాజా తీర్మానం దెబ్బకు అంగీకారం తెలిపింది. కొవిడ్-19 విషయంలో అప్రమత్తంగా వ్యవహరించలేదని, చైనాకు అనుకూలంగా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు​ పైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. 400 మిలియన్​ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు డొనాల్డ్​ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details