తెలంగాణ

telangana

ETV Bharat / international

'5జీ సాంకేతికతను భాగస్వామ్య దేశాలకు అందిస్తాం'

5జీ సేవలను భాగస్వామ్య దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. సమానత్వం, పరస్పర గౌరవం ఆధారంగా భాగస్వామ్య దేశాలతో లాభదాయక సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ స్పష్టం చేశారు.

'5జీ సాంకేతికతను భాగస్వామ్య దేశాలకు అందిస్తాం'

By

Published : Jun 8, 2019, 7:34 AM IST

Updated : Jun 8, 2019, 8:35 AM IST

'5జీ సాంకేతికతను భాగస్వామ్య దేశాలకు అందిస్తాం'

సాంకేతికతలో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న చైనా ఇటీవలే 5జీ సేవలను వినియోగంలోకి తెచ్చింది. ఈ సాంకేతికతను తమ భాగస్వామ్య దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 5జీ తో పాటు మరిన్ని అధునాతన సాంకేతికతలనూ పంచుతామని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ స్పష్టం చేశారు. రష్యాలోని సెయింట్​ పీటర్స్​బర్గ్​లో జరిగిన ఎకనామిక్​ ఫోరంలో పాల్గొన్న జిన్​పింగ్ ఈ ప్రకటన చేశారు. సమానత్వం, పరస్పర గౌరవం ఆధారంగా భాగస్వామ్య దేశాలతో లాభదాయక సహకారం కోసం చైనా చూస్తున్నట్లు తెలిపారు.

5జీ నెట్​వర్క్​లోని ముఖ్య యంత్రాలను పలు దేశాలకు ఎగుమతి చేస్తోన్న హువావే సంస్థను అమెరికా బ్లాక్​లిస్ట్​లో పెట్టిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి : నేటి నుంచి రెండు రోజులు మోదీ విదేశీ పర్యటన

Last Updated : Jun 8, 2019, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details