తమ దేశ ప్రజలకు కరోనా టీకా అందించేందుకు చైనా వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా.. ప్రయోగాత్మక దశలో ఉన్న దేశీయ టీకాల వినియోగానికి చైనాలోని రాష్ట్రాలు కసరత్తులు చేస్తున్నాయి. భారీ మొత్తంలో టీకాలకు ఆర్డర్లు ఇచ్చాయి.
అయితే చైనాలో అభివృద్ధి చేస్తోన్న టీకాలపై అధికారుల నుంచి సరైన సమాచారం లేదు. ఇవి ఏమేరకు ప్రభావవంతంగా ఉంటాయో, 1.4 బిలియన్ జనాభా ఉన్న దేశంలో వీటిని ఎలా పంపిణీ చేయగలరనే విషయాలపై ఎన్నో సందేహాలున్నాయి.
ఇదీ చూడండి:-తగ్గుతున్న చైనా జనాభా- కారణం అదే!
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చైనా టీకాలపై పరీక్షలు జరుగుతున్నాయి. కనీసం ఐదు వ్యాక్సిన్లు ఆశాజనకంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ టీకాలను అందించేందుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది చైనా.
సినోఫార్మ్ అనే సంస్థ తాము అభివృద్ధి చేస్తున్న టీకాను మార్కెట్లోకి విడుదల చేసేందుకు గత నెలలో ప్రభుత్వ అనుమతులు కోరింది. మిగిలిన వ్యాక్సిన్లు.. ఆరోగ్య సిబ్బంది, కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న వారికి అందించేందుకు అత్యవసర వినియోగానికి అనుమతులు పొందాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే 10లక్షల మందికిపైగా ప్రజలు ఈ టీకా తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే టీకాలను ఎలా పంపిణీ చేస్తారనే విషయంపై కంపెనీలు ఇంకా స్పందించలేదు. అదే సమయంలో ఎంతమందికి టీకా అందిస్తామనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు.
ఇదీ చూడండి:-జాబిల్లిపై జాతీయ జెండా పాతిన చైనా