తెలంగాణ

telangana

ETV Bharat / international

టీకా పంపిణీకి చైనా సన్నాహాలు

కొవిడ్​-19 మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వ్యాక్సిన్​ పంపిణీకి సన్నద్ధమవుతోంది చైనా. ఇప్పటికే పలు రాష్ట్రాలు టీకాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అత్యవసర వినియోగ అనుమతులు పొందిన టీకాలను 10 లక్షల మందికిపైగా ఇప్పటికే అందించినట్లు తెలిపింది.

vaccination
టీకా పంపిణీకి చైనా సన్నాహాలు

By

Published : Dec 7, 2020, 2:37 PM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్​ పంపిణీకి సన్నాహాలు చేస్తోంది చైనా. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగ దశలో ఉన్న, దేశీయంగా తయారైన టీకాలకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు చేస్తున్నాయి. అయితే.. అవి ఎలా పనిచేస్తాయి, దేశంలోని 140 కోట్ల మందికి ఏవిధంగా అందించటం అనే అంశాలపై ఆరోగ్య శాఖ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవటం గమనార్హం.

తుది అనుమతులు రాకముందే, అత్యవసర వినియోగంలో భాగంగా ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది, తీవ్రంగా ప్రభావితమైన 10 లక్షల మందికి టీకా అందించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే.. అవి ఎంతమేర ప్రభావవంతంగా పనిచేశాయనేది టీకా తయారీ సంస్థలు ప్రకటించలేదు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

జియాగ్సూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సినోవాక్​, సినోఫార్మా సంస్థల నుంచి అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్​ కొనుగోలుకు ఆదేశాలు జారీ చేసింది. సిచౌన్​ రాష్ట్రం ఇప్పటికే తాము వ్యాక్సిన్​ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అన్హూయ్​ రాష్ట్రంలో ప్రజలు వ్యాక్సిన్​ కావాలనుకుటున్నారో లేదో తెలుసుకోవాలని స్థానిక కమిటీలను ఆదేశించారు అధికారులు. షాంఘైకు దక్షిణంగా ఉన్న జెజియాంగ్ రాష్ట్రం గత అక్టోబర్​లోనే అత్యవసర వినియోగ అనుమతుల్లోనే పెద్ద ఎత్తున పంపిణీ చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ముందుగా ఎక్కవ రిస్క్​ ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.

ఒకే సంస్థ..

చైనాలో ఇప్పటి వరకు వ్యాక్సిన్​ వినియోగానికి కావాల్సిన తుది అనుమతుల కోసం గత నవంబర్​లో సినోఫార్మా ఒక్కటే దరఖాస్తు చేసుకుంది. మిగతావి కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే అనుమతులు కోరాయి.

చైనాలో కరోనా వైరస్​ అదుపులోనే ఉన్నప్పటికీ.. ప్రయోగ దశలో ఉన్న వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఎందుకు పంపిణీ చేయాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇదీ చూడండి: 'సూపర్​ జవాన్ల' కోసం చైనా భయంకర ప్రయోగాలు!

ABOUT THE AUTHOR

...view details