కరోనా సంక్షోభాన్ని జయించిన చైనా.. ఆర్థిక రంగంలో శరవేగంగా దూసుకుపోతోంది. వాణిజ్య కార్యకలాపాలకు ఊతమందిస్తూ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ నెల 20 నుంచి థియేటర్లకు అనుమతిచ్చింది. అయితే 30శాతం సీటింగ్ సామర్థ్యంతోనే థియేటర్లను నడపాలని స్పష్టం చేసింది.
మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కో సీటును విడిచి టికెట్లు అమ్మాలి. థియేటర్లో ప్రతి ఒక్కరు కనీసం ఒక మీటరు భౌతిక దూరాన్ని పాటించాలి. టికెట్ కొనేవారు తమ అసలు పేరు రిజిస్టర్ చేసుకోవాలి.