తెలంగాణ

telangana

ETV Bharat / international

సీడీఎస్​ రావత్​ వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం

భారత్​కు అతిపెద్ద భద్రతా ముప్పు చైనా(India China Latest News) అని చీఫ్​ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్​(సీడీఎస్) బిపిన్​ రావత్​ వ్యాఖ్యానించడంపై ఆ దేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. రావత్​ వ్యాఖ్యలు.. భౌగోళిక, రాజకీయ ఘర్షణను ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఆరోపించింది.

india china relations
భారత్, చైనా సంబంధాలు

By

Published : Nov 26, 2021, 11:06 AM IST

చైనా నుంచి భారత్​కు(India China Latest News) అతిపెద్ద భద్రతా ముప్పు పొంచి ఉందని చీఫ్​ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్​(సీడీఎస్​) బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశం ఖండించింది. రావత్ వ్యాఖ్యలు వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని చైనా రక్షణ విభాగం పేర్కొంది. ఈ వ్యాఖ్యలు భౌగోళిక, రాజకీయ ఘర్షణను ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఆరోపించింది.

"చైనాతో ముప్పు నినాదంతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతింటున్నాయి. రాజకీయ ఘర్షణనలు రెచ్చగొట్టడం.. ఇరు దేశాలకు ప్రమాదకరం"అని రక్షణశాఖ ప్రతినిధి వూ కియాన్​ తెలిపారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడం కోసం భారత్ తమకు సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. తద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయన్నారు.

విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్ అధ్యక్షతన ఇటీవల 18వ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో రష్యా, చైనా దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రూ.50లక్షల కోట్లు దాటిన పాకిస్థాన్​ అప్పులు

ABOUT THE AUTHOR

...view details