China Moon water: చందమామపై నీటి ఆనవాళ్లను చైనా ల్యాండర్ చాంగే-5 కనుగొంది. జాబిల్లి ఉపరితలంపై ఉంటూ నీటి జాడను పసిగట్టడం ఇదే మొదటిసారి. ఈ ల్యాండర్ ఉన్న ప్రదేశంలో 120 పీపీఎం మేర నీరు ఉన్నట్లు ల్యాండర్ తేల్చింది. తేలికైన, వెసిక్యులర్ శిలలో 180 పీపీఎం మేర జలం జాడ ఉన్నట్లు వెల్లడైంది.
చంద్రుడిపై నీటి జాడను కనుగొన్న చాంగే-5 - చైనా వ్యోమనౌక చాంగే-5
China Moon Water: చైనా ల్యాండర్ చాంగే-5..చంద్రుడిపై నీటి ఆనవాళ్లను కనుగొంది. జాబిల్లి ఉపరితలంపై ఉంటూ నీటి జాడను పసిగట్టడం ఇదే మొదటిసారి.
China Moon water
భూమి మీదతో పోలిస్తే ఈ శిలలు చంద్రుడిపై ఎక్కువ పొడిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహాల ద్వారా రిమోట్ సెన్సింగ్ పద్ధతిలో పరిశీలించినప్పుడు జాబిల్లిపై నీటి ఉనికిని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. ఇప్పుడు చాంగే-5 ల్యాండర్.. శిలలు, ఉపరితలంపై జలం ఆనవాళ్లను కనుగొంది. చంద్రుడి ఉపరితలంపై కనిపించే తేమలో అధిక భాగం.. సౌర గాలుల ద్వారా వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చూడండి:అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం- 19 మంది మృతి