చైనాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హునన్ రాష్ట్రం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. 5 గంటల్లో 238 మందిని రక్షించినట్టు తెలిపారు. వీరిలో 51 మంది చిన్నారులున్నారు.
పుజియన్ రాష్ట్రంలో కొండచరియలు విరిగి పడ్డాయి. 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 5 వేలకు పైగా నివాసాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.