తెలంగాణ

telangana

ETV Bharat / international

గల్వాన్​ ఘర్షణపై చైనా 'బూటకపు' వీడియో!

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో గతేడాది భారత్​-చైనాల మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలను బహిర్గతం చేసింది చైనా. తొలుత భారత జవాన్లే కయ్యానికి కాలు దువ్వినట్టు అందులో చూపే ప్రయత్నం చేసింది.

China Released a video of Galwan Conflict
గల్వాన్​ ఘర్షణపై చైనా 'బూటకపు' వీడియో విడుదల!

By

Published : Feb 20, 2021, 11:42 AM IST

Updated : Feb 20, 2021, 12:01 PM IST

గతేడాది జూన్​లో జరిగిన గల్వాన్​ ఘర్షణకు సంబంధించిన ఓ వీడియోను చైనా విడుదల చేసింది. తొలుత భారత సైనికులే చొరబడినట్లు, తమ సైన్యం వారిని నిలువరించినట్లు చూపించే ప్రయత్నం చేసింది. రాత్రివేళ ఇరు సైన్యాలు ఫ్లాష్​లైట్ల వెలుతురులో కేకలు వేసుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

చైనా విడుదల చేసిన గల్వాన్​ ఘర్షణ దృశ్యాలు

అయితే.. ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం చైనాకు వెన్నతో పెట్టిన విద్యగా సైనికవర్గాలు పేర్కొన్నాయి. పాంగాంగ్​ సరస్సులో సైనిక ఉపసంహరణ తర్వాత ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో.. గల్వాన్​ ఘర్షణలో తమ సైనికులు మృతి చెందినట్టు అంగీకరించిన చైనా వ్యూహాత్మకంగానే ఈ వీడియోను విడుదల చేసినట్లుగా భావిస్తున్నారు.

గతేడాది మే నుంచి సరిహద్దులో భారత్​తో కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. ఈ క్రమంలోనే జూన్​లో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. గల్వాన్​ లోయలో భారత సైనికులపై చైనా జవాన్లు దాడికి దిగారు. ప్రతిఘటించిన భారత్​.. చైనాకు దీటుగా బదులిచ్చింది. ఈ ఘటన ప్రపంచ దేశాలను షాక్​కు గురిచేసింది. అనంతరం సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనా చర్చలు చేపట్టాయి.

ఇదీ చదవండి:'గల్వాన్​' మృతులపై తొలిసారి చైనా ప్రకటన

Last Updated : Feb 20, 2021, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details