చైనాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే వరుణుడి ప్రకోపంతో లేకిమా తుపాను కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా శుక్రవారం లియోనింగ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. ఆ ప్రాంతం మొత్తం కారుమబ్బు కమ్మేసింది.
చైనాలో భీకర గాలుల బీభత్సం
కొద్ది రోజులుగా లేకిమా తుపాను విధ్వంసంతో అతలాకుతలమైన చైనాను భీకర గాలులు భయపెడుతున్నాయి. సుడిగాలుల ధాటికి ఇళ్లు, చెట్లు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలను సైతం వేళ్లతో పెకిలించేశాయి.
చైనాలో భీకర గాలుల బీభత్సం
భయంకరంగా విరుచుకుపడిన గాలులు పెద్ద పెద్ద చెట్లనూ వేర్లతో పెకిలించేశాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు. సహాయక బృందం రంగంలోకి దిగి రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగిస్తున్నారు.
ఇదీ చూడండి:ఉవ్వెత్తున ఎగసిన కార్చిచ్చు.. రంగంలోకి హెలికాప్టర్లు.
Last Updated : Sep 27, 2019, 6:59 AM IST