తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2021, 10:27 AM IST

ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓ బృందానికి చైనా పూర్తి సహకారం!

కొవిడ్​ మూలాలపై పరిశోధన చేసేందుకు వుహాన్​లో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్​ఓ నిపుణులకు చైనా అధికారులు తమ సైట్లను సందర్శించేందుకు పూర్తిస్థాయి అనుమతులిచ్చింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్​ఓ బృందం వెల్లడించింది.

China granted WHO team full access in Wuhan
డబ్ల్యూహెచ్​ఓ బృందానికి చైనా పూర్తి సహకారం!

కరోనా వైరస్​ మూలాలపై పరిశోధన చేసేందుకు వుహాన్​లో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) బృందానికి చైనా అధికారులు పూర్తి స్థాయి సహకారమందిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సైట్ల సందర్శన కోసం తమ సిబ్బందికి చైనా అధికారులు అన్ని అనుమతులు ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్​ఓ నిపుణులు తెలిపారు.

డబ్ల్యూహెచ్​ఓ బృందం.. తమ దర్యాప్తులో ఉన్న అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించిందని, ఇందులో ఎలాంటి అభ్యంతరాలూ లేవని బ్రిటీష్​ సంతతి వ్యక్తి, జంతు శాస్త్రవేత్త పీటర్​ దాస్జక్​ తెలిపారు. ఈయన న్యూయార్క్​ సిటీలోని ఎన్​జీఓ ఎకోహెల్త్​ అలయన్స్​ అధ్యక్షుడిగా ఉన్నారు. తొలుత నిపుణులు.. తాము సందర్శించే ప్రదేశాలపై చైనా అధికారులకు వివరాలివ్వగా.. వారు సమగ్ర సమాచారం అందించినట్టు చెప్పారాయన.

ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్​ఓ బృందానికి సహకరిస్తున్న చైనా అధికారులపై ప్రశంసలు కురింపిచారు దాస్జక్​. 2003లో విస్తరించిన సార్స్​(సివియర్​ అక్యూట్​ రెస్పిరేటరీ సిండ్రోమ్​) మూలాలపై పరిశోధన చేసిన వుహాన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ డిప్యూటీ డైరెక్టర్​ షి జెంగ్లీ, ఆయనతో కలిసి పనిచేసిన బృందాన్ని దాస్జక్​ అభినందించారు.

ప్రస్తుతానికి ​సైట్ల​ సందర్శనలను ముగించిన డబ్ల్బ్యూహెచ్​ఓ నిపుణులు.. పూర్తిస్థాయి పరిశోధనకు గానూ మరి కొద్దిరోజుల పాటు అక్కడే ఉండనున్నారని దాస్జక్​ చెప్పారు.

ఇదీ చదవండి:డబ్ల్యూహెచ్​ఓ పర్యటనతో చైనా కరోనా గుట్టు వీడుతుందా?

ABOUT THE AUTHOR

...view details