తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉత్తర చైనాలో భారీ అగ్ని ప్రమాదం - అటవీ ప్రాంతం

ఉత్తర చైనాలోని షాంగ్జీలో రేగిన మంటల వల్ల ఇప్పటి వరకు సుమారు 666 హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. తక్షణం స్పందించిన అగ్నిమాపక దళం స్థానికులను ఖాళీ చేయించి, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఉత్తర చైనాలో భారీ అగ్ని ప్రమాదం

By

Published : Mar 30, 2019, 8:36 PM IST

ఉత్తర చైనాలో భారీ అగ్ని ప్రమాదం

ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్​లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. ఎదురుగాలులు బలంగా వీస్తుండడం వల్ల సుమారు 666 హెక్టార్ల ప్రాంతంలోని అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది.

తక్షణం స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, ముందు జాగ్రత్త చర్యగా ఆ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 3, 800 మంది ప్రజలను ఖాళీ చేయించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు.

ఎదురుగాలులు విపరీతంగా వీస్తుండడం వల్ల మంటలను అదుపుచేయడం కష్టమవుతోంది. అయినా సుమారు 150 మంది అగ్నిమాపక సిబ్బంది, 30 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి : వెనిజువెలా నగరాల్లో మరోమారు చీకట్లు

ABOUT THE AUTHOR

...view details