హాంకాంగ్‌లోకి తొలిసారి బలగాలను మోహరించిన చైనా హాంకాంగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ఐదు నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు, బలగాల మధ్య ఘర్షణలు చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆందోళనలను అణిచివేసేదుకు చైనా తొలిసారి తన బలగాలను హాంకాంగ్లో మోహరించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద మిలటరీ దళం.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందిన సైనికులను తొలిసారి మోహరించినట్లు హాంకాంగ్‌లోని దక్షిణ చైనాకు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది. ప్రజా సంబంధిత పనుల్లో పీఎల్ఏ బలగాలను వినియోగించటం గడిచిన ఏడాది కాలంలో ఇదే తొలిసారి.
సేవల వంకతో..
ఆకుపచ్చ చొక్కా, నల్ల రంగు షార్ట్ ధరించిన చైనా సైనికులు ఎర్ర రంగు బకెట్లను పట్టుకుని కౌలూన్ ప్రాంతం రెన్ఫ్రేడ్ రోడ్‌లోని బాప్టిస్ట్ విశ్వవిద్యాలయం ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. తరువాత సైనికులు జాగింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి వారు వెళ్లిపోయారు.
తమ చర్యతో హాంకాంగ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని.. హింసాత్మక ఘటనలు, గందరగోళాన్ని తగ్గించటమే తమ బాధ్యతగా పేర్కొన్నాయి పీఎల్ఏ బలగాలు. ఈ కార్యక్రమంలో వారితో పాటు అగ్నిమాపక బృందాలు, పోలీసులు పాల్గొన్నారు.
పరిస్థితులు విషమిస్తాయనే ఉద్దేశంతో చైనా ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు ఇంత వరకు సైనికులను ఉపయోగించలేదు. అయితే సేవల రూపంలో మొదటిసారిగా తన సైనికులను రంగంలోకి దింపింది.
నగర రక్షణ దళాల చట్టంలోని ఆర్టికల్ 14 ప్రకారం పీఎల్ఏ.. స్థానిక వ్యవహారాల్లో కలుగజేసుకోకూడదు. కానీ స్థానిక ప్రభుత్వం విపత్తు నిర్వహణలో సాయం చేయాలని కోరితే బలగాలు పాలుపంచుకోవచ్చు. చైనా పాలన నుంచి విముక్తి లభించినప్పటి నుంచి గత 22 ఏళ్లలో ఇలాంటి అభ్యర్థన ఎప్పుడూ రాలేదు.
బ్రిక్స్ వేదికగా తొలిసారి..
గత ఐదు నెలలుగా హాంకాంగ్లో చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై గత గురువారం పెదవి విప్పారు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్. హింస, గందరగోళ పరిస్థితులకు ముగింపు పలకాల్సిన తక్షణ అవసరం ఉందని పేర్కొన్నారు. బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో జరిగిన 11వ బ్రిక్స్ సదస్సు వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చూడండి: కశ్మీర్: ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు