తెలంగాణ

telangana

ETV Bharat / international

64కు చేరిన చైనా రసాయన పేలుడు మృతులు

తూర్పు చైనా యాంగ్​చెంగ్​లోని రసాయనిక కర్మాగారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 64కు చేరింది. గురువారం జరిగిన అత్యంత ఘోరమైన ఈ పేలుడుకు కారణాలపై సత్వరమే నివేదిక సమర్పించాలని అధ్యక్షుడు షీ జిన్​పింగ్ అధికారులను ఆదేశించారు.

పేలుడు అనంతరం కమ్మేసిన విషవాయువులు

By

Published : Mar 23, 2019, 9:43 AM IST

Updated : Mar 23, 2019, 9:54 AM IST

చైనా రసాయన పేలుడు దృశ్యాలు
తూర్పు చైనా జియాంగ్​సూ రాష్ట్రం యాంగ్​చెంగ్​లోని రసాయనిక కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 64కు పెరిగింది. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

ప్రమాద కారణాలపై సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని అధికారులను చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ ఆదేశించారు. విషవాయువులు 500 మీటర్ల వరకూ ప్రభావం చూపించే అవకాశముందని హెచ్చరించారు అధికారులు.

Last Updated : Mar 23, 2019, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details