తెలంగాణ

telangana

'హాంకాంగ్​లో నిరసనలు అడ్డుకునేందుకు కఠిన చట్టాలు తేవాలి'

హాంకాంగ్​లో ఆందోళనలు అరికట్టేందుకు కఠినమైన భద్రతా చట్టాలను అమలు చేయ్యాల్సిన అవసరం ఉందని చైనా అభిప్రాయపడింది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు.. నిరసనలకు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉందని హాంకాంగ్​ ప్రభుత్వం తెలిపింది.

By

Published : Nov 10, 2019, 7:01 PM IST

Published : Nov 10, 2019, 7:01 PM IST

Updated : Nov 10, 2019, 8:04 PM IST

'హాంకాంగ్​లో నిరసనలు అడ్డుకునేందుకు కఠిన చట్టాలు తేవాలి'

'హాంకాంగ్​లో నిరసనలు అడ్డుకునేందుకు కఠిన చట్టాలు తేవాలి'

హంకాంగ్​లో నిరసనలు రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నిరసనలపై చైనా ఘాటుగా స్పందించింది. సరైన భద్రతా చట్టాలు లేకపోవడమే నిరవధిక నిరసనలకు కారణమని డ్రాగన్​ దేశం అభిప్రాయపడింది. వీటికి ముంగింపు పలకాలంటే కఠిన చట్టాలు అమలు చేయాలని తెలిపింది.

ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్నందుకు ఆగ్రహంగా ఉన్న నిరసనకారులకు ఇలాంటి చట్టాలు మరింత ఆవేశాన్ని కలిగిస్తాయని హాంకాంగ్​ ప్రభుత్వం అభిప్రాయపడింది.

2003ను గుర్తుచేస్తున్నాయి

2003లో హాంకాంగ్​-బీజింగ్ ప్రభుత్వం​... కఠినమైన భద్రతా చట్టాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేసింది. ఫలితంగా అది భారీ నిరసనలకు దారి తీసింది. ఇప్పుడు మళ్లీ చైనా వ్యాఖ్యలు నిరసనకారుల్లో ఆగ్రహావేశాల్ని రగిలించేలా ఉన్నాయని హాంకాంగ్​ ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.
హాంకాంగ్​లో నవంబరు 24న జిల్లా ఎన్నికలను నిర్వహించనున్నారు. నిరసనలు ప్రారంభమైన నాటి నుంచి ఓటరు నమోదు భారీగా పెరిగింది. ప్రతి నియోజకవర్గంలో నిరసనకారులు ఒక్కో అభ్యర్థిని నిలబెట్టారు.

అరెస్టుతో మరిన్ని...

హాంకాంగ్​లో ప్రజాస్వామ్య అనుకూల చట్టసభ సభ్యులను అరెస్ట్​ చేసినందుకు నిరసనగా ఆదివారం సబ్​వే స్టేషన్​, షాపింగ్​ మాల్​లోని కిటికీలను ఆందోళనకారులు పగలకొట్టారు. చైనా ప్రతిపాదిత నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా గత ఆరునెలలుగా హంకాంగ్​లో నిరసనలు హోరెత్తుతున్నాయి. చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ... ప్రజాస్వామ్య పాలన కోసం నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు.

ఇదీ చూడండి:నేడే అయోధ్య భూవివాదం కేసుపై తీర్పు

Last Updated : Nov 10, 2019, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details