తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​ సరిహద్దులకు దగ్గర్లో 30 విమానాశ్రయాలు! - చైనా ఎయిర్​పోర్టులు

భారత సరిహద్దుకు చేరువగా టిబెట్​, షిన్​జియాంగ్ ప్రావిన్స్​లో కొత్తగా 30 విమానాశ్రయాలను(China Building Airport) చైనా నిర్మిస్తోంది. టిబెట్‌లో ఓ హైస్పీడ్ బుల్లెట్​ రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా సరిహద్దుల్లోకి శరవేగంగా సైన్యాన్ని తరలించాలన్నది చైనా ఎత్తుగడగా కనిపిస్తోంది.

china airports builidng in india border
భారత సరిహద్దులో చైనా విమానాశ్రయాలు

By

Published : Sep 10, 2021, 9:16 AM IST

భారత సరిహద్దులకు(India Border With China) చేరువలో విమానాశ్రయాల సంఖ్యను(China Building Airport) చైనా పెంచుతోంది. టిబెట్‌, షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో కొత్తగా 30 ఎయిర్‌పోర్టులను నిర్మిస్తోంది. వీటిలో కొని ఇప్పటికే సిద్ధమయ్యాయి. వీటి వల్ల పౌర, సైనిక మౌలికవసతులు మెరుగుపడతాయని చైనా అధికారిక మీడియా పేర్కొంది.

టిబెట్‌లో ఇతర రవాణా సౌకర్యాలనూ డ్రాగన్‌ పెంచుతోంది. వాటిలో హైస్పీడ్‌ బులెట్‌ రైలు కూడా ఉంది. ఇది అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులకు చేరువ వరకు నడుస్తోంది. ఈ విమానాశ్రయాలు, రైళ్ల ద్వారా సరిహద్దుల్లోకి శరవేగంగా సైన్యాన్ని తరలించాలన్నది చైనా ఎత్తుగడగా కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details