తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా పేలుడు ఘటనలో 44కు మృతుల సంఖ్య

తూర్పు చైనాలోని ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. విస్ఫోటనం తీవ్రతతో ఫ్యాక్టరీలోని భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో 44 మంది మరణించారు. 32 మంది పరిస్థితి విషమంగా ఉంది.

చైనా పేలుడు ఘటనలో 44కు మృతుల సంఖ్య

By

Published : Mar 22, 2019, 9:41 AM IST

చైనా పేలుడు ఘటనలో 44కు మృతుల సంఖ్య
తూర్పు చైనాలో జరిగిన రసాయన పేలుడులో మృతుల సంఖ్య 44కు పెరిగింది. జియాంగ్​సూ రాష్ట్రం యాంచెంగ్ లోనిఓ రసాయన కర్మాగారంలో ప్రమాదకర రసాయనం బెంజీన్​ కారణంగా ఈ భారీ విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో మరో 90 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 32 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

గాయపడిన వారిలో విద్యార్థులూ ఉన్నారు. ఘటనా స్థలానికి సమీపంలో పదికిపైగా పాఠశాలలు ఉన్నాయి. వీటిని అధికారులు మూసేశారు.

రసాయనాల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. పేలుడు అనంతరం స్పల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details