తూర్పు చైనాలో జరిగిన రసాయన పేలుడులో మృతుల సంఖ్య 47కు పెరిగింది. జియాంగ్సూ రాష్ట్రం యాంచెంగ్ లోని ఓ రసాయన కర్మాగారంలో ప్రమాదకర రసాయనం బెంజీన్ కారణంగా ఈ భారీ విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో మరో 90 మంది క్షతగాత్రులయ్యారు.
గాయపడిన వారిలో విద్యార్థులూ ఉన్నారు. ఘటనా స్థలానికి సమీపంలో పదికిపైగా పాఠశాలలు ఉన్నాయి. వీటిని అధికారులు మూసేశారు.