తెలంగాణ

telangana

ETV Bharat / international

వాణిజ్య యుద్ధం: డబ్ల్యూటీఓకు చైనా ఫిర్యాదు

అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం నానాటికీ పెరుగుతోంది. తాజాగా ఈ విషయంపై డబ్ల్యూటీఓను ఆశ్రయించింది డ్రాగన్​ దేశం. అగ్రరాజ్యం తనకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ... తమ వస్తువులపై సుంకాలను భారీగా పెంచుతోందని ఆరోపించింది. వివాద పరిష్కారానికే డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసినట్టు స్పష్టం చేసింది చైనా.

By

Published : Sep 3, 2019, 8:20 AM IST

Updated : Sep 29, 2019, 6:16 AM IST

వాణిజ్య యుద్ధం: డబ్ల్యూటీఓకు చైనా ఫిర్యాదు

డబ్ల్యూటీఓకు చైనా ఫిర్యాదు

అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)ను ఆశ్రయించింది చైనా. తమ వస్తువులపై అమెరికా ఇష్టానుసారంగా సుంకాలు పెంచుతోందని డబ్ల్యూటీఓకు ఫిర్యాదు చేసింది డ్రాగన్​ దేశం. అమెరికా తాజాగా విధించిన బిలియన్​ డాలర్ల సుంకాలు అమల్లోకి వచ్చిన కొన్ని గంటలకే చైనా డబ్ల్యూటీఓలో ఈ అంశాన్ని లేవనెత్తింది.

దాదాపు ఏడాదిగా సాగుతున్న అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచదేశాలపైనా ప్రభావం చూపుతోంది. ఇటీవలి కాలంలో వీరి మధ్య సుంకాల పెంపుపై నువ్వా-నేనా అన్నంతగా పోటీ జరుగుతోంది.

ఒసాకాలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినట్టు డ్రాగన్​ దేశం ఆరోపించింది. డబ్ల్యూటీఓ నిబంధనల మేరకు తమ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపిన చైనా.....ఈ వివాద పరిష్కారం కోసమే అమెరికాపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి- హాంకాంగ్​: విద్యార్థుల నిరసనలతో నేతలపై ఒత్తిడి

Last Updated : Sep 29, 2019, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details