తెలంగాణ

telangana

ETV Bharat / international

దేశాభివృద్ధికి చైనా 'స్వదేశీ' మంత్రం - జిన్​పింగ్​

దేశీయ మార్కెట్​ను బలోపేతం చేసి దేశాభివృద్ధి సాధించాలని నిర్ణయించుకున్నట్టు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ ప్రకటించారు. ఇందుకోసం వచ్చే ఏడాది నుంచి చైనా కొత్త ప్రయాణం మొదలుపెడుతోందన్నారు. ప్రపంచ దేశాల నుంచి చైనాకు వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో జిన్​పింగ్​ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

China all set to change its development model from 2021: Xi
దేశాభివృద్ధికి చైనా 'స్వదేశీ' మంత్రం

By

Published : Nov 20, 2020, 5:36 AM IST

ప్రపంచవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో ఈ దేశాధ్యక్షుడు జిన్​పింగ్​ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి తమ అభివృద్ధి పంథాను మార్చుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఎగుమతుల ఆధారిత అభివృద్ధి బదులు.. దేశీయ వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఆసియా-పెసిఫిక్​ ఎకనామిక్​ కొఆపరేషన్​(ఏపీఈసీ) సీఈఓ చర్చల్లో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు జిన్​పింగ్​. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని దేశీయ వినియోగం పెంచాలన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టం చేశారు.

"ఆధునిక సోషలిస్ట్​ దేశాన్ని నిర్మించేందుకు.. వచ్చే ఏడాది నుంచి చైనా ఓ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దేశీయ వ్యవస్థకు పేద్ద పీట వేసి.. అంతర్జాతీయ వ్యవస్థను దానితో అనుసంధానిస్తాం. ప్రస్థుత పరిస్థితులు, చైనా అభివృద్ధి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం."

--- జిన్​పింగ్​, చైనా అధ్యక్షుడు.

అనేక దేశాల నుంచి చైనాకు వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా చైనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. చైనాకు అమెరికా నుంచి వచ్చే దిగుమతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ వ్యవస్థను బలపరుచుకునేందుకు జిన్​పింగ్​ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేసింది. దేశీయ మార్కెట్​కు భారీగా ఊతమందిస్తూ 14వ పంచవర్ష ప్రణాళికను రూపొందించింది.

ఇదీ చూడండి:-'టీకా అభివృద్ధి కోసం భారత్​కు సహకరిస్తాం'

ABOUT THE AUTHOR

...view details