తెలంగాణ

telangana

ETV Bharat / international

అంటార్కిటికాకూ పాకిన కరోనా - అంటార్కిటికాలో కరోనా

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చివరికి అంటార్కిటికాకు కూడా చేరింది. అక్కడ చిలీకి చెందిన రెండు సైనిక స్థావరాల్లో ఉన్న 58మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. వీరిలో 21మంది తమ నేవీ ఓడలో అంటార్కిటికాకు చేరినట్టు చిలీ అధికారులు వెల్లడించారు.

Pandemic reaches Antarctica, last untouched continent
అంటార్కిటికాకు కూడా పాకిన కరోనా

By

Published : Dec 23, 2020, 10:09 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని ఖండాలనూ చుట్టేసింది. తాజాగా.. అంటార్కిటికాలోని రెండు మిలిటరీ స్థావరాల్లో ఉన్న 58 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలినట్టు చిలీ అధికారులు వెల్లడించారు. వీరిలో 36మంది జెనరల్​ బెర్నార్డో ఓ హిగ్గిన్స్​ రిక్యెల్మే సైనిక స్థావరంలో ఉన్నట్టు పేర్కొంది. మరో 21మంది.. చిలీ నుంచి అంటార్కిటికాకు వెళ్లిన నేవీ ఓడ సర్జియెంట్​ ఆల్డియాకు చెందిన వారని స్పష్టం చేసింది.

మరొక కేసు లాస్​ ఎస్ట్రెల్లాస్​ అనే గ్రామంలో వెలుగుచూసింది. లుటినెంట్​ రోడాల్ఫ్​ మార్ష్​ మార్టిన్​ వాయుదళ స్థావరంలో చిలీకి చెందిన పౌర సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు.

కరోనా కేసులపై తమకు అవగాహన ఉన్నట్టు అంటార్కిటికాలోని అమెరికా కార్యకలపాలను పర్యవేక్షిస్తున్న యూఎస్​ నేషనల్​ సైన్స్​ ఫౌండేషన్​ వెల్లడించింది. కరోనా సోకిన వారితో అమెరికా బృందం కలవలేదని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి :'ట్రంప్​ 2.0 ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు!'

ABOUT THE AUTHOR

...view details