భారత్ సహా నాలుగు ఆసియా దేశాలకు చెందిన చిన్నారులకు.. వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర ముప్పు పొంచి ఉందని యూనిసెఫ్ హెచ్చరించింది. ఈ మేరకు చిల్డ్రన్స్ క్లైమెట్ రిస్క్ ఇండెక్స్-సీసీఆర్‌ఐ పేరుతో ఓ నివేదికను రూపొందించింది. పర్యావరణ మార్పులతో అధిక ప్రభావానికి గురయ్యే దేశాలకు ర్యాంకులను కేటాయించింది.
తుపానులు, వడగాలులు వంటి ప్రకృతి పరమైన విపత్తులు చిన్నారులపై అధిక ప్రభావం చూపే అవకాశముందని.. యూనిసెఫ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆసియాలోని భారత్ సహా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లోని చిన్నారులపై వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తన నివేదికలో హెచ్చరించింది.