పాకిస్థాన్‌లో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. ఏకంగా రూ.20 కోట్ల నగదుతో ఉడాయించాడు ఓ సెక్యూరిటీ సంస్థకు చెందిన హుస్సేన్ షా అనే క్యాష్ వ్యాన్ డ్రైవర్.
ఎలా జరిగిందంటే..
ఆగస్టు 9న కరాచీలో ఈ ఘటన జరిగింది. చుంద్రీగర్ రోడ్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్‌లో నగదు జమ చేయడానికి డ్రైవర్ హుస్సేన్, వ్యాన్ సెక్యూరిటీ గార్డు వచ్చారు. ఈ సమయంలో నగదు బదిలీ కార్యక్రమాల కోసం గార్డు.. బ్యాంకులోనికి వెళ్లారు. అతను తిరిగివచ్చి చూసే సరికి వ్యాను కనిపించలేదు.
డ్రైవర్‌కు ఫోన్ చేయగా అత్యవసర పనిమీద వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు హుస్సేన్. కాసేపటికి మరోసారి ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో హుస్సేన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
బ్యాంకుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో వ్యాను లభించిందని పోలీసులు తెలిపారు. అందులో నగదు సహా తుపాకులు, కెమెరా, డీవీఆర్లు అపహరణకు గురయ్యాయని వెల్లడించారు. హుస్సేన్‌ను 6నెలల కిందటే ఇంట్లో నుంచి గెంటేసినట్లు అతడి తండ్రి చెప్పారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఫ్లైట్‌లో వచ్చి బైక్‌ల చోరీ- ఓఎల్ఎక్స్లో దందా!